Prabhas: ‘స్పిరిట్’ నుంచి క్రేజీ న్యూస్.. విలన్ రోల్‌కు బాలీవుడ్ కపుల్స్!

ManaEnadu: బాహుబలి(Bahubali) మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). అప్పటి నుంచి తన ప్రతి మూవీ అదే రేంజ్‌లో ఉండేలా చూసుకుంటున్నాడు కూడా. దీంతో ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగానూ ఫ్యాన్స్(Fans) సొంతమయ్యారు. అటు ప్రభాసే కాదు.. ఆయన అభిమానులూ ప్రభాస్ సినిమా అంటే భారీ రేంజ్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్(Expectations) పెట్టేసుకుంటున్నారు. అలాంటిది ఇక ప్రభాస్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా తెరకెక్కే చిత్రం ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఆడియన్స్‌లో అప్పుడే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాంటి ‘స్పిరిట్(Spirit)’ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

రెండేళ్ల క్రిమతే అనౌన్స్ చేసేశాడు..

మరోవైపు తన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయే 25వ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అని, దానికి ‘స్పిరిట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీపై ఎలాంటి అప్డేట్స్(Updates) రాలేదు. ఒకవైపు ప్రభాస్ కూడా తన బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్‌(Commitments)ను పూర్తిచేస్తూ వస్తున్నాడు. దీంతో ప్రభాస్ కాల్ షీట్స్ దొరకదని భావించి ‘యానిమల్’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ మూవీ బ్లాక్‌బస్టర్(Blockbuster) హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు అన్నీ ‘స్పిరిట్’పైపు మళ్లాయి.

 

 సౌత్‌పైనే సైఫ్ ఫోకస్

ఇదిలా ఉండగా ‘స్పిరిట్’లో విలన్‌ రోల్‌పై ప్రస్తుతం పలు వార్తలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో విలన్‌గా ఒకరు కాదని, ఒక బాలీవుడ్ స్టార్ కపుల్‌ను సందీప్ రెడ్డి వంగా రంగంలోకి దించనున్నాడని సమాచారం. వారెవరో కాదు.. బాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ కపుల్స్‌లో ఒకరు కరీనా కపూర్(Kareena Kapoor), సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్ ‘ఆదిపురుష్ (Adipurush)’లో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి తనతో పాటు తన భార్య కరీనా కూడా ప్రభాస్‌ను ఎదిరించే ధీటైన విలన్స్‌గా కనిపించనున్నారనే వార్త ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. సైఫ్ అలీఖాన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీలోనూ విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రస్తుతం ఆయన ఫోకస్ సౌత్‌పైనే ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్‌లోనూ ఆయన నటించే అవకాలను కొట్టిపారేయలేం అని టీటౌన్లో వార్తలు వస్తున్నాయి.

Share post:

లేటెస్ట్