ManaEnadu: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Jony Master)పై లైంగిక ఆరోపణల కేసు(Case) నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై జానీ మాస్టర్ పలు మార్లు లైంగిక వేధింపుల(sexual harassment)కు పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)లో సంచలనం సృష్టిస్తుంది. అత్యాచారం కేసుతో పాటుగా తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఈ ఫిర్యాదు తర్వాత ఇప్పటివరకు జానీ మాస్టర్ బయటకి రాకపోవడంతో అందరూ ఆయనను విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. నిన్న యాంకర్ అనసూయ, కరాటే కళ్యాణి, హీరోయిన్ కృతిశెట్టి పలు కామెంట్స్(Comments) చేశారు. తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్(Choreographer Jyoti Raj) సంచలన వ్యాఖ్యలు చేసింది.
అసలు విషయాలు తెలియకుండా మనం ఎలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచింది. రెండు వైపులా స్టోరీ తెలియకుండా, ఆరోపణలు ప్రూవ్ అవ్వకుండా ఫేమ్(Fame) ఉన్న ఒక వ్యక్తిపై మాటల దాడి చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో(Video) రిలీజ్ చేశారు. ఈ వీడియోలో డైరెక్ట్‌గా జానీ మాస్టర్ కేసు అని చెప్పకుండా కేసుకు సంబంధించి ఆమె చెప్పింది. జ్యోతికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతుంది.
నిజానిజాలు తెలియకుండా మాట్లాడొద్దు: జ్యోతి రాజ్
ఆ వీడియోలో జ్యోతి రాజ్(Jyoti Raj) మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్(Over smart) అవుతున్నారు. చాలామంది అమ్మాయిల గురించి ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే(All are equal). ఎంత పెద్దవాళ్లను అయినా వాళ్లను వదలకూడదు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌తో లైఫ్‌లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్(Career)ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. అలాంటి వారిని కూడా శిక్షించాలి. ఆరోపణలు వచ్చినప్పుడు రెండూ వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్‌ని మన వ్యూస్(views) కోసం, ఇంటర్వూస్(Interviews) కోసం వాడొద్దు. తప్పు చేస్తే కచ్చితంగా ఎవరికైనా శిక్ష(punishment) పడాల్సిందే.. అసలు నిజం ఏంటో కచ్చితంగా బయటకు వస్తుంది’’ అని వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.