Devara: NTR ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది!

ManaEnadu: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మూవీ నుంచి మరో అప్డేట్(Update) వచ్చేసంది. తాజాగా ఈ స్టార్ హీరో నటించిన “దేవర (Devara)” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌(Prerelease event)ను మూవీ టీమ్ ఫిక్స్ చేసింది. ఈనెల 22న ఈ ఈవెంట్‌‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్‌ను కొనసాగించారు. ఇంతకీ ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఆంధ్రప్రదేశ్‌(AP)లోగానీ లేదా తెలంగాణ(TG)లోని ఏదో ఒక చోట ఔట్‌డోర్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల నుంచి అనుమతి(permission) రాకపోవడంతో HYDలోని నోవాటెల్ హోటల్‌(Novatel Hotel)లో నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ బాకీ ఉంది.

 ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం..

ఇదిలా ఉండగా.. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR fans) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ ఓ ట్వీట్(Tweet) చేశారు. అదేంటంటే.. ‘‘ఇది తమ డెమీగాడ్‌ని చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అతని అభిమానుల మహాసముద్రం కోసం.. అతను కూడా మిమ్మల్ని చూడడానికి వేచి ఉండలేడు.. ప్రేమ వరదను తెద్దాం! 22న కలుద్దాం.#దేవర’’ అంటూ క్యాప్షన్(Caption) జత చేసింది. ఇక దేవర మూవీని నిర్మిస్తున్న యువసుధ(Yuvasudha Arts) ఆర్ట్స్ కూడా ఇదే పోస్ట్ చేసింది. “బిగ్ స్క్రీన్స్ ను తాకే ముందే ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న. మరిన్ని వివరాలు త్వరలోనే..” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.

 అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

కాగా, జనతా గ్యారేజ్‌ లాంటి సక్సెస్​ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ(NTR- Koratala Siva) కాంబోలో తెరకెక్కిన సినిమా ఇది. ఎన్టీఆర్‌ డ్యుయెల్ రోల్ చేశారు. సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) విలన్​గా నటించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ వీడియోలు, సాంగ్స్ సినీ ప్రియులను, NTR ఫ్యాన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు మూవీ టీమ్ సైతం ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.

Share post:

లేటెస్ట్