ManaEnadu: రేప్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పర్ పల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతోపాటు అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది.
నేషనల్ అవార్డు వచ్చిన తరువాత జానీ మాస్టర్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలని చెప్పుకుంటున్న ఆ అమ్మాయి టాలెంట్‌ను చూసి డీ షో తరువాత ఆమెకు జానీ మాస్టర్ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఆ అమ్మాయిని వాళ్ల అమ్మ చాలా టార్చర్ చేస్తుందని, ఆమె వాళ్ల కుటుంబ విషయాలు మొత్తం తమతో షేర్ చేసుకుందని అన్నారు. 16 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగితే అప్పుడు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మూడేళ్ల నుంచి ఆమె ప్రవర్తన తేడాగా ఉందని అన్నారు.
తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ పై ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలి చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఆయన్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకువచ్చి శుక్రవారం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు.దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి చంచలాగూడ జైలుకు తరలిస్తున్నారు.