
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అగ్రరాజ్యంలో పనిచేసే భారతీయ ఐటి ఉద్యోగుల(Indian IT Employees)పై మరోసారి తన అక్కకు వెళ్లగక్కారు. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్(IT professional) ఉద్యోగులకు తిరుగులేని స్థానం ఉంది. మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google) వంటి కంపెనీలకు భారతీయులు ఏకంగా సీఈవో స్థాయికి ఎదిగారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగకుతూ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగులకు అమెరికన్ ఐటి కంపెనీలో ఉద్యోగం కల్పించకూడదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నిజానికి ట్రంప్ చేసిన ప్రకటన భారతీయుల ఉద్యోగ అవకాశాల పైన ఏ మేర ప్రభావితం చూపుతుందో తక్షణమే చెప్పలేమంటున్నారు టెక్ నిపుణులు.
ఈ దేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు
ఎందుకంటే భారతీయులు అమెరికాలోని పలు ఐటి కంపెనీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు. వారిని ఏ కారణం లేకుండా అకారణంగా వెనక్కు పంపడం అనేది దాదాపు అసాధ్యమే. అయితే కొత్తగా అమెరికాకు ఐటీ ఉద్యోగాల అవకాశాల కోసం వచ్చే భారతీయులకు మాత్రం ట్రంపు చేసిన ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మాత్రమే కాకుండా భారతీయులను అక్కున చేర్చుకునే దేశాలు చాలా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీలు ఐటీ రంగంలో దిగ్గజాలుగా ఉన్న పలు కంపెనీలకు మాతృదేశాలుగా ఉన్నాయి. ఆయా దేశాల్లో ఇండియన్ ఐటి ప్రొఫెషనల్ ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉంది. కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
Narendra Modi’s “friend” Trump has once again spewed venom against India.
Trump said — American tech companies hire people in India…
But under his rule, those days are over.The message is loud and clear: Don’t hire Indians.
Now, Narendra Modi must respond. pic.twitter.com/Q98lDffnjK
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) July 24, 2025