
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన సంగీతానికి తగ్గట్టు స్టేజిపై ఉత్సాహంగా స్టెప్పులు వేసిన రామ్మోహన్, బంధుమిత్రులతో కలిసి ఈలలు, కేరింతల నడుమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారి, యువతలో ఆయన చురుకుదనానికి మంచి స్పందన లభిస్తోంది. సాధారణంగా రాజకీయాలు(Politics), మీటింగ్‌లతో బిజీగా ఉండే రామ్మోహన్, ఈ సందర్భంగా సరదాగా చిల్ అయ్యారు.
TDP శ్రేణులు, అభిమానుల ఆనందం
“సీటీ కొట్టాలోయ్” పాటకు ఆయన వేసిన స్టెప్పులు అందరినీ ఆనందపరిచాయి. ఈ వేడుకలో ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు(Atchannaidu) కూడా రామ్మోహన్ డ్యాన్స్‌ను చూసి మునిగిపోయారు. శ్రీకాకుళం ఎంపీ(Srikakulam MP)గా హ్యాట్రిక్ సాధించిన రామ్మోహన్, ఈ డ్యాన్స్‌తో తనలోని మరో ప్రతిభను బయటపెట్టారు. ఈ వీడియో చూసిన TDP శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ తన చురుకైన వైఖరి, రాజకీయాలతోపాటు సామాజిక సందర్భాల్లోనూ ఆయన ఉత్సాహాన్ని చాటుతోంది. మరి కేంద్ర మంత్రి డ్యాన్స్ వీడియోను మీరూ చూసేయండి..
Union Civil Aviation Minister Rammohan Naidu showed off his dance skills at a wedding in Srikakulam, joining youngsters on stage for “#GangLeader“! #UnionMinister #RammohanNaidu #Dance #Srikakulam pic.twitter.com/VlHpFotxGi
— 🇮🇳Tirish Reddy (@tirishreddy) July 29, 2025