Urvashi Rautela : ‘సౌత్‌లోనూ నాకు గుడి కట్టాలి’.. ఇదేం పైత్యం బ్రో

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి అలరించింది. ముఖ్యంగా డాకు మహారాజ్(Daaku Maharaaj)లో చేసిన దబిడి దిబిడి పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్ కొరియోగ్రఫీపై వివాదం కూడా నెలకొంది. అయితే ఇందులో నటించిన ఊర్వశి తరచూ తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో ఈ భామ నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఆలయం ఉందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Image

ఉత్తరాఖండ్‌లో నా టెంపుల్

ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఓ ఆలయం (Urvashi Rautela Temple in Uttarakhand) ఉందని చెప్పింది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండని నెటిజన్లకు సూచించింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో తన ఫొటోకు పూలమాల వేసి తనను ‘దండమమాయి’ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), బాలకృష్ణలతో కలిసి నటించానని.. అక్కడ కూడా తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని తెలిపింది ఈ భామ.

Image

దక్షిణాదిలో గుడి కట్టండి

అంతటితో ఆగకుండా సౌత్ ఇండియాలో తనకు రెండో గుడి(Urvashi Rautela Temple News)ని కట్టాలని అభిమానులను కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది ఊర్వశి. ఈ గుడికి వచ్చినవారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా అని యాంకర్‌ అడగ్గా.. అది ఆలయమని అన్నీచోట్లా ఏం జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని తెలిపింది. ఇక ఈమె ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు షాక్ తో పాటు ఆశ్చర్యపోతున్నారు. ‘ఈమె పూర్తిగా భ్రమలో మునిగిపోయింది’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈమె పైత్యం మామూలుగా లేదు బ్రో అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తోంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *