విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తాజా చిత్రం ‘#VENKY77’ గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)తో జతకట్టిన ఈ సినిమాకు ‘వెంకట రమణ(Venkata Ramana)’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్(Title)తో పాటు ‘కేర్ ఆఫ్ ఆనంద నిలయం(C/o Ananda Nilayam)’ అనే ట్యాగ్‌లైన్ కూడా చర్చల్లో ఉంది, ఇది కుటుంబ కథా చిత్రంగా భావోద్వేగ, హాస్య అంశాలతో రూపొందుతుందని సూచన. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ‘వెంకట రమణ’ టైటిల్ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ఆగస్టు చివరి వారంలో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో..
కాగా వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam)’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో, త్రివిక్రమ్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ గతంలో వెంకటేష్ చిత్రాలైన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లకు మాటలు రాశారు. కానీ ఇది వారిద్దరి కాంబోలో వస్తున్న మొదటి పూర్తి స్థాయి దర్శక-నట సహకారం. ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాల మిశ్రమంతో వెంకటేష్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు.
చిరు మూవీలో వెంకీ కీలక పాత్ర
కాగా వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘MEGA157’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు, ఇది అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో వెంకటేష్ తన వైవిధ్యమైన నటనా కౌశలాన్ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు.
🎬 #Venkatesh – #Trivikram Bankrolls!
The much-anticipated project is wrapping up pre-production, with @VenkyMama set to join the shoot from early August.#VenkyTrivikram #Thaman #HaarikaHassine #Nagavamsi pic.twitter.com/hQ1K14d9J7
— The Cine Gossips (@TheCineGossips) July 2, 2025






