
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన తాజా తెలుగు యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’ థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ(OTT)లో సందడి చేయనుంది. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.53 కోట్లకు సొంతం చేసుకుంది. ఆగస్టు 28 లేదా 29 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుందని సమాచారం.
‘స్పై మిషన్’లో ఆకట్టుకున్న విజయ్ పోరాటం
కాగా ‘కింగ్‌డమ్’ సినిమా ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా ప్రారంభమై, గూఢచారి(Spy)గా మారి, శ్రీలంక(Srilanka)లో ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని పట్టుకునే మిషన్‌లో విజయ్ దేవరకొండ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse), సత్యదేవ్, వెంకటేష్ వీపీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం సమకూర్చగా, జోమన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించారు. థియేటర్ వెర్షన్‌లో కత్తిరించిన ఒక రొమాంటిక్ సాంగ్ ‘హృదయం లోపల’ అనే సాంగ్‌తోపాటు ఓ యాక్షన్ సీన్‌ను కూడా ఓటీటీ వెర్షన్‌లో చేర్చనున్నట్లు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు.
#Kingdom OTT RELEASE AUGUST 28 & 29 @NetflixIndia pic.twitter.com/l8GGK3qy6Y
— OTT TELUGU (@GuruNat90064034) August 7, 2025
రూ.130 కోట్ల బడ్జెట్‌తో..
కాగా ఈ మూవీ థియేటర్లలో రూ.50.55 కోట్లకుపైనే వసూలు(Collections) చేసింది. అయితే రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రీలంక తమిళ ప్రజల చిత్రణపై వివాదం కూడా ఎదురైంది, దీనిపై చిత్ర బృందం క్షమాపణ వ్యక్తం చేసింది. ఓటీటీ విడుదలతో ‘కింగ్‌డమ్’ మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకుని, కొత్త జోష్‌ను సంతరించుకునే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.