ఇన్ఫ్లుయెన్సర్ అభిజ్ఞ ఉత్తలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’(Viraatapalem: pc Meena Reporting). రెక్కీ, వధువు లాంటి సినిమాలను తెరకెక్కించిన కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5 (ZEE 5) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. 1980ల నాటి మారుమూల భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఆ గ్రామంలో పెళ్లి రోజునే వధువులు ఎందుకు చనిపోతున్నారు? దశాబ్ద కాలంగా అక్కడ వివాహాలు ఎందుకు జరగడం లేదు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సిరీస్పై ఆసక్తి రేపుతున్న ఈ ట్రైలర్ను మీరూ చూసేయండి.






