ManaEnadu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని అన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు తెలిపారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాబు ప్రకటించారు. ఏలేరు ప్రాజెక్టు ఇన్ ఫ్లో గమనించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు. ఆ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు వివరించారు.