ManaEnadu:దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra) ఇటీవలే తన విడాకుల పోస్టుతో సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె చేసిన మరో పోస్టు కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ఇది కూడా DIVORCE కు సంబంధించినది కావడం గమనార్హం. అయితే డివోర్స్ అంటే మీరనుకుంటున్న విడాకులు మాత్రం కాదండోయ్. ఈమెకు ఇప్పటికే విడాకులు ఓయిపోయాయి. మరి ఈ యువరాణి మాట్లాడుతున్న డివోర్స్ దేని గురించి అంటే?
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra Instagram) ఇన్‌స్టాగ్రాం వేదికగా ఓ కీలక ప్రకటన జారీ చేశారు. ఆమె సొంత బ్రాండ్ ‘మహ్రా ఎమ్1’ కింద ఓ పర్ఫ్యూమ్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకు రాబోతున్నారు. అయితే తాజాగా ఆమె ఈ పర్ఫ్యూమ్‌కు సంబంధించి ఓ పోస్టు పెట్టారు. పర్ఫ్యూమ్‌కు డివోర్స్‌కు సంబంధం ఏంటి అంటారా? అక్కడే ఉంది మరి అంతా. ఆమె తన పర్ఫ్యూమ్‌కు పెట్టిన పేరు ‘DIVORCE’. డివోర్స్ పేరిట కొత్త పర్ఫ్యూమ్‌ను తీసుకొస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె తన పర్ఫ్యూమ్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. DIVORCE- By MAHRA MI.. COMING SOON అని షేక్ మహ్రా పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. త్వరలో ఈ పర్ఫ్యూమ్ (Sheikha Mahra Perfume Brand)ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. పర్‌ఫ్యూమ్ విలువ ఎంతో తెలియాల్సి ఉంది. ఈమె పోస్టు చూసిన నెటిజన్లు ఈ యువరాణి ఏది చేసినా తన స్టైల్లో చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఆమె కొన్ని నెలల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి (UAE PM Mohammed bin Rashid Al Maktoum) షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మహ్రా. ఆమె దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌ను మే 27, 2023న వివాహమాడారు. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఈ ఏడాది జులైలో ‘‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్ యూ’. టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని అప్పుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు.