తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు.. ఇదిగో ఆధారాలు : ఆనం

ManaEnadu:YSRCP హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు (Animal Fat) ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. ఈ నివేదికల్లో పొందుపర్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) విడుదల చేశారు. జులై 8, 2024న ఈ లడ్డూలు, అందులో ఉపయోగించిన నెయ్యిని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లు ఆనం తెలిపారు.

ఆవు నెయ్యిలో సోయాబీన్ (Soya Bean), పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు (Pig Fat) కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బయటపడింది. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదు ఈ విషయాన్ని ఈ నివేదిక ఆధారాలతో సహా నిరూపించింది. జగన్ సర్కార్ (Jagan Govt) భక్తుల నమ్మకంతో ఆటలాడుకుంది. వారి ఆరోగ్యంతో ఆటాడింది. 

నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, జగన్ సర్కార్ రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచింది. నలుగురికి నెయ్యి టెండర్‌ (Ghee Tender) కాంట్రాక్టు ఇచ్చారు. ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్‌ సర్టిఫికేషన్‌ లేదు. నెయ్యి సర్టిఫికేషన్‌కు రూ.75 లక్షలతో ల్యాబ్‌ పెట్టే పరిస్థితిలో లేరా నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసింది. అందులో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైంది. అని ఆనం వెల్లడించారు.

జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి తిరుమలలో లడ్డూలు (Tirumala Laddu) వాసన వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఆనం తెలిపారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​కి చెందిన నందిని నెయ్యిని మార్చేశారని, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly)లో కూడా చర్చ జరిగిందని వెల్లడించారు. టీటీడీకి 75 లక్షల రూపాయలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అని గత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *