ManaEnadu : సెప్టెంబరులో వర్షాలు, వినాయక చవితి (Vinayaka Chaviti), ఇతర పండుగలతో విద్యా సంస్థలకు సెలవులు ఎక్కువ వచ్చాయి. గణేశ్ నిమజ్జనం పూర్తి కావడంతో విద్యార్థులంతా స్కూళ్ల బాట పట్టారు. మళ్లీ ఎప్పుడు సండే వస్తుందా.. ఎప్పుడు హాలిడేస్ (Holidays) వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే?
దసరా పండగ (Dussehra Festival) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 13 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ (బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులను డిక్లేర్ చేసింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti)తో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు (Dussehra Holidays) ఇస్తున్నట్టు ప్రకటించాయి.
జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్ 15వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం (Schools Re Open) అవుతాయి. అక్టోబర్ 14వ తేదీన కళాశాలలు తెరుచుకోనున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పది రోజులు స్కూల్ కు వెళ్తే ఆ తర్వాత ఎంచక్కా ఊళ్లకు వెళ్లొచ్చని సంబుర పడుతున్నారు.