ManaEnadu:ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గురించి తెలియని వారుండరు. ఆయనకు కేవలం ఆస్ట్రేలియాలోనే కాదు ఇండియాలో సూపర్ ఫ్యాన్డమ్ ఉంది. ఆయన క్రికెట్‌కు ఎంతమంది అభిమానులున్నారో.. వార్నర్ పర్సనాలిటీకి అంతే ఫ్యాన్స్ ఉన్నారు. వార్నర్‌కు.. తెలుగు వారికి విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టీమ్‌కు సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలా తెలుగు వారితో ఆయనకు బంధం ఏర్పడింది.
అయితే కరోనా సమయంలో ఈ బంధం కాస్త బలపడింది. తెలుగు సినిమా పాటలకు రీల్స్ చేయడం, టాలీవుడ్ హీరోల (Tollywood Heroes) డైలాగ్స్‌ను ఇమిటేట్ చేయడం, వారి స్టైల్‌ను కూడా ఇమిటేట్ చేయడంతో డేవిడ్ భాయ్ అంటూ తెలుగు ప్రేక్షకులు వార్నర్‌కు ముద్దు పేరు పెట్టేశారు. ఇక వార్నర్‌కు కూడా ఇండియన్ సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాలోని శ్రీ వల్లి (Srivalli song) పాట, తగ్గేదేలే మేనరిజం చేస్తూ తెలుగు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు.
ఇక ఇటీవల దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Warner Rajamouli Ad)తో ఓ యాడ్ చేసి తానూ నటించగలనని హింట్ ఇచ్చాడు. అలా డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తే ఎంత బాగుంటుందోనని ఊహించిన అభిమానులకు ఓ సర్ప్రైజింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఇటీవలె డేవిడ్ వార్నర్ గన్ పట్టుకుని ఓ షూటింగ్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట లీక్ అవ్వడంతో ఆయన ‘పుష్ప-2’లో అతిథిలా కనిపించనున్నాడని అనుకున్నారు.
అయితే టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది కానీ వార్నర్ నటిస్తోంది పుష్ప మూవీ (Pushpa 2)లో కాదట. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ‘రాబిన్ హుడ్ (Robinhood)’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో తళుక్కున మెరిసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేశారట. ఆ సమయంలో తీసిన కొన్ని స్టిల్సే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక వార్నర్ చాలా సార్లు హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెబుతూనే.. హైదరాబాద్‌ను మిస్ అవుతున్నానంటూ తరచూ తన ప్రేమను వ్యక్త పరుస్తుంటాడు. 2025 ఐపీఎల్ మెగా వేలం (2025 IPL Mega Auction)లో సన్‌రైజర్స్ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. ఇక టాలీవుడ్ హీరోలతోనూ వార్నర్‌కు మంచి బాండింగ్ ఉంది. అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు ప్రతి బర్త్‌డేకు సోషల్ మీడియా వేదికగా వార్నర్ విష్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ల సినిమా ఏదైనా రిలీజ్ అయినా తప్పకుండా అప్రిషియేషన్ పోస్టు పెడుతుంటాడు.
You're not made to play these tinput tournaments. You're the only match winner of Pakistan. We can't win matches without you. Please leave this league @iShaheenAfridi #ChampionsCup | #ShaheenShahAfridi pic.twitter.com/zsvn5dGN4r
— MURPHY (@IM_MURPHY_) September 22, 2024








