ManaEnadu: చెపాక్(Chepak) వేదికగా బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India) విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. 3వ రోజు ఆట ముగిసేసరికి భారత్ 356 పరుగుల ఆధిక్యం(Lead)లో కొనసాగుతోంది. 515 పరుగుల భారీ టార్గెట్(Target)తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా ఆట ముగిసే సమయానికి 158/4తో నిలిచింది. క్రీజులో నజ్ముల్ షాంటో (51*), షకిబ్ (5*) ఉన్నారు. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) 3, పేస్ గన్ జస్ర్పీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను త్వరగానే ముగించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేన(Rohit) రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగుల చేసింది. అప్పటికే 308 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇక అదే ఉత్సాహంతో మూడో రోజు ఆట ప్రారంభించిన గిల్, పంత్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
బంగ్లా ముందు భారీ టార్గెట్
ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(Rishabh pant) తన కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు నాలుగు సిక్సులు ఉన్నాయి. అటు మరో యంగ్ ప్లేయర్ గిల్(Gill) 176 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సుల సహాయంతో 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంత్ 109 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో KL రాహల్ క్రీజులోకి వచ్చాడు. 19 బాల్స్ లో 22 పరుగులు చేశాడు. దీంతో 64 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి IND 287 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్(Declare) చేశారు. మొదటి ఇన్సింగ్స్ లీడ్‌తో కలుపుకొని భారత్ జట్టు 514 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ముందు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
దాదాపు 20 నెలల తర్వాత
ముఖ్యంగా మూడో రోజు ఆటలో పంత్ ఆటే హైలైట్. దాదాపు 20 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్(Red ball Cricket)లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషభ్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మరో ఘనత(Record) సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన నిలిచాడు. ఇప్పటివరకు పంత్ 6 శతకాలు బాదాడు. ఈ క్రమంలో ఆయన ధోనీ(MSD) (6) రికార్డును సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 58 ఇన్నింగ్సుల్లోనే సాధించాడు. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా (3) ఉన్నాడు.
Just @RishabhPant17 things 🤟🤟
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/WSYpvqwzr1
— BCCI (@BCCI) September 21, 2024