Mana Enadu : మలయాళీ కుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) టాలీవుడ్ లో జెంటిల్మెన్ సినిమాతో అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని(Nani)తో కలిసి ఆయనకు దీటుగా నటించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు చేజిక్కించుకుని తెలుగు ప్రేక్షకుల మది దోచేసింది. ఇటీవల ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.
తాజాగా నివేదా.. ’35 చిన్న కథ కాదు (35-Chinna Katha Kaadu)’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇందులో నివేదా నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.
ఇటీవల థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ(Ott)లోనూ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘Aha’ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. “ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది.” అంటూ ఆహా షేర్ చేసిన పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
స్టోరీ ఏంటంటే? ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ వీరే తన ప్రపంచంగా బతుకుతున్న సాధారణ గృహిణి ఆమె. పెద్దోడికి (అరుణ్) లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. సున్నాకి విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే కూడా పది ఎందుకవుతుందంటూ అడుగుతుంటాడు.
లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) ఫండమెంటల్స్‌ను ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి లాస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టి ఆరో తరగతిలో ఫెయిల్ చేస్తాడు. ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే అతడు లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ పరిస్థితుల్లో అరుణ్ క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలంటూ టెన్త్ ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.






