బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ ఊచకోత.. కళ్లు చెదిరేలా ఫస్ట్ డే కలెక్షన్స్

Mana Enadu : “దేవర సెప్పినాడంటే.. సేసినట్టే”.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘దేవర’ సినిమాలోని డైలాగ్ ఇది. తారక్ చెప్పినట్లుగానే మరో బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత గ్లోబల్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబరు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ జాతరతో యాక్షన్ తో అదరగొట్టి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాడు.

యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఎమోషన్, డైలాగ్స్ ఇలా ప్రతిదాంట్లో సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చి మరోసారి తన నటవిశ్వరూపం చూపించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన దేవరకు ఫస్ట్ డే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ (Koratala Shiva) హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా దేవరను తెరకెక్కించారు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటించింది. ఇక విలన్ గా సైఫ్ అలీఖాన్ తన విశ్వరూపం చూపించాడు. థ్రిల్లింగ్ ట్విస్ట్స్, ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ లో పిచ్చెక్కించే హైప్ తో తెరకెక్కించిన ఫైట్ దేవర సక్సెస్ (Devara Success) కు కారణమయ్యాయని సినీ వర్గాల్లో టాక్.

 

ఇక దేవర సక్సెస్ తో తారక్ (Tarak Fans) ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఫస్ట్ డే దేవర బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కళ్లు చెదిరే ఓపెనింగ్స్ తో ఆకట్టుకుంది. మొదటి రోజున దేశవ్యాప్తంగా దేవర (Devara Collections) రూ.77 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకురూ.140 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా  ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని తెలిసింది.

‘దేవర’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ (NTR Devara) కృతజ్ఞతలు చెప్పారు. “నా ఫ్యాన్స్ చేసుకుంటున్న వేడుకలు చూసి నా మనసు నిండిపోయింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాలాగే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే ఆనందంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను” అని తారక్​ ట్వీట్ చేశాడు.

Share post:

లేటెస్ట్