అట్టహాసంగా ఐఫా వేడుక.. ఉత్తమ నటుడిగా నాని, మెగాస్టార్ కు మరో అవార్డు

Mana Enadu : సినిమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదబీ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో రెండో రోజున పలువురు తారలు సందడి చేశారు.  ఈ వేడుకలో టాలీవుడ్‌ (Tollywood), కోలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు పురస్కారాలు దక్కించుకున్నారు. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో టాలీవుడ్​ నుంచి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు.

‘Outstanding Achievement In Indian Cinema’ పుర‌స్కారాన్ని మెగాస్టార్ (CHiranjeevi)అందుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా నేచురల్ స్టార్ నాని, గోల్డెన్ లెగసీ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ లో ఉత్తమ విలన్ అవార్డును దసరా సినిమాకు గానూ షైన్ టామ్ దక్కించుకున్నాడు. Woman Of The Year అవార్డును స్టార్ హీరోయిన్​ సమంత గెలుచుకున్నారు. ఈ వేడుకల్లో ఇంకా ఎవరెవరు ఏయే కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నారంటే?

  • ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా – చిరంజీవి
  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా – ప్రియదర్శన్‌
  • ఉమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ – సమంత
  • గోల్డెన్‌ లెగసీ అవార్డు – బాలకృష్ణ
  • ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ)- రిషబ్‌ శెట్టి
  • ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్‌
  • ఉత్తమ నటుడు (తెలుగు)- నాని
  • ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ విలన్‌ (తమిళం) – ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
  • ఉత్తమ విలన్‌ (తెలుగు) – షైన్‌ టామ్‌ (దసర)
  • ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
  • ఉత్తమ సాహిత్యం – జైలర్‌ (హుకుం)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ నేపపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ విలన్‌ (మలయాళం) – అర్జున్‌ రాధాకృష్ణన్‌

Share post:

లేటెస్ట్