DEVARA Review: దేవర.. మాస్ జాతర

ManaEnadu:ఆరేళ్ల ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న మూవీ ఇదే. మధ్య వచ్చిన RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అందుకే మునుపెన్నడూ లేనంతగ ఇటు తారక్ ఫ్యాన్స్, అటు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరి ఆ వెయిటింగ్‌కు డైరెక్టర్ కొరటాల శివ న్యాయం చేశారా? ఎన్టీఆర్ ఎలా చేశారు? అనిరుధ్ మ్యూజిక్ ఎప్పటిలాగే ఆకట్టుకుందా? అనేది తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్ర సముద్రం అనే పేరుతో ఓ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో నాలుగు ఊర్లు. ఆ ఊళ్లకు ఎన్టీఆర్(దేవర), సైఫ్ అలీ ఖాన్(భైర) అండదండ. తమ ఊళ్ల కోసం వీరిద్దరూ సముద్రంలో వచ్చే పడవలను దోచుకుంటూ ఉంటారు. ఓసారి మురళీశర్మ(మురుగ)కు సంబంధించిన అక్రమ ఆయుధాలతో గ్రహించిన దేవర.. ఆ ఆయుధాలతో తమకు డేంజర్ అని, ఇక ఈ దోపిడీ ఆపేద్దామంటాడు. కానీ భైర అందుకు ససేమిరా ఒప్పుకోడు. దీంతో దేవరకి భైరతో గొడవవుతుంది. శత్రుత్వం పెరుగుతూ పోతుంది. మరి దేవర ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాడు? ఆ తర్వాత దేవర కుమారుడు వర ఏం చేశాడు? అనేదే స్టోరీ.
తారక్ ఎలా చేశాడంటే?

డబుల్ రోల్‌లో తారక్ నటన సినిమాకే హైలైట్. ఇటు దేవర, అటు వరగా డిఫరెంట్ మాడ్యులేషన్స్ కనబరచడంలో తారక్ సక్సెస్ అయ్యారు. సో తన సినిమాను మరోసారి కెప్టెన్‌గా ముందుండి నడిపించారు. ఆరేళ్ల తన అభిమానుల దాహాన్ని నటనతో తీర్చారు. వర పాత్రలో ఒక సాధారణ వ్యక్తిగా, పిరికివాడి చేయడం ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే వర పాత్ర కాస్త ఎంటర్‌టైనింగ్ ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాలో ఎన్టీఆర్ ఫైట్స్‌కు వంక పెట్టే అవకాశం లేదు. సో ఎప్పటిలాగే ఎన్టీఆర్ తన నటన, డ్యాన్సులతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చారన్నమాట.

సైఫ్, జాన్వీ ఇంకాస్త..!
ఈ మూవీలో భైర రూపంలో సైఫ్ అలీ ఖాన్‌కు(Saif Ali Khan) లెంగ్తీ క్యారెక్టర్ ఇచ్చారు. అయితే కాస్త లిప్ సింక్ విషయంలో అక్కడక్కడ సైఫ్ తడబడ్డట్లు అనిపించింది. ఆయన డబ్బింగ్ ఎందుకు పెట్టారా? అనిపిస్తుంది. హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఈ మూవీలో ఉందా లేదా అన్నట్లే అనిపిస్తూనే ఆమె క్యారెక్టర్ వల్ల సినిమా సాగదీతలా అనిపిస్తుంది. యాక్టింగ్ విషయంలో ఎన్టీఆర్ తప్పితే ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సినిమాలో ఉన్న నటులంతా స్క్రీన్‌ను నింపడానికే ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఎన్టీఆర్‌కు తగ్గ డైలాగ్స్?
వారిద్దరి క్యారెక్టర్స్‌పై డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాస్త వర్కౌట్ చేయాల్సింది. ఇక సెకండాఫ్‌ అయితే ఫస్ట్ హాఫ్‌ను మ్యాచ్ చేయలేకపోయింది. స్టోరీ రైటింగ్ కాస్త వీక్ అనిపించింది. ఎన్టీఆర్ సినిమా అంటే డ్యాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు.. అదే స్థాయిలో డైలాగ్స్ కూడా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో టీజర్, ట్రైలర్‌లో ఇచ్చిన హైప్‌కు సినిమాలో డైలాగ్స్‌కు సంబంధం లేదు.

ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు..
ఎన్టీఆర్‌ను మైండ్‌లో పెట్టుకొని.. మిగితా అంచనాలన్నింటినీ పక్కన పెట్టి థియేటర్‌‌కు వెళితే మాస్ జాతరను ఎంజాయ్ చేయవచ్చు. వీఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి టెక్నికల్ టర్మ్స్ అన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్‌ను చూస్తూ సినిమాను ఆస్వాదించవచ్చు. ఒక సగటు జూ.ఎన్టీఆర్ అభిమానికి కావాల్సిన మాస్ ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు వెళ్లేటప్పుడు పేపర్లు తీసుకెళ్లడం మాత్రం మర్చిపోకండోయ్. ఎటువంటి టాక్‌ను మైండ్‌లో పెట్టుకోకుండా వెళ్లే వారికి ఒక స్టార్ హీరో సినిమా కనిపించడం మాత్రం పక్కా.

రివ్యూ: 3.75/5 (దేవర.. ఎర్ర సముద్రం పోటెత్తింది)

 

Share post:

లేటెస్ట్