తమ్ముడి కోసం ఆలియా యాక్షన్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘Jigra’ ట్రైలర్

Mana Enadu : ఆలియా భట్.. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇటీవలే ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఆలియా ‘జిగ్రా’ (Jigra Movie) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మోనికా ఓ మై గర్ల్ ఫ్రెండ్ ఫేం డైరెక్టర్ వసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఆలియా అదిరిపోయే పర్ఫామెన్స్

ఈ ట్రైలర్ లో ఆలియా (Alia Bhatt) ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఇది తమ్ముడి కోసం ఓ అక్క చేసే పోరాటంలా కనిపిస్తోంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన తమ్ముడి పాత్రలో ఆర్చిస్ ఫేం వేదాంగ్ రైనా (Vedang Raina) నటిస్తున్నాడు. అక్కడ డ్రగ్స్ కేసులో చిక్కుకుని ఉరి శిక్ష పడిన ఖైదీగా వేదాంగ్ ఈ ట్రైలర్ లో కనిపించాడు. అక్కడ అతణ్ని చిత్రహింసలు పెట్టినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక ఆలియా భట్ వేదాంగ్ రైనాకు అక్కగా నటిస్తోంది. జైల్లో ఉన్న తమ్ముడిని ఎలాగైనా బయటకు తీసుకుని రావాలని ఆలియా చేసిన ప్రయత్నాలు ట్రైలర్ (Jigra Trailer) లో ఆకట్టుకున్నాయి.

గూస్ బంప్స్ తెప్పించే నటన

ముఖ్యంగా విదేశీ జైల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడిన ఖైదీని కలవడం అక్కడ అంత సులభం కాదు. అందుకే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఖైదీని కలవొచ్చనే నిబంధన ఉందేమోనని.. ఆలియా తన తమ్ముడిని కలవడం కోసం ఏకంగా తన చేయి కట్ చేసుకోవడానికి ప్రయత్నించే సీన్ గూస్ బంప్స్ తెప్చించింది.

ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఆలియా భట్

మరోవైపు ట్రైలర్ చివరలో.. ‘నేను మంచిదాన్నని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు.. నేను కేవలం అంకుర్ కు అక్కని’ అని తన తమ్ముడిపై ఉన్న ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసిన సీన్ ఆలియా (Alia Bhatt Jigra) నటన పీక్స్ లో ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆలియా భట్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లేననిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ‘Raazi’ మూవీ తర్వాత మరోసారి ఆలియాను ఇలా యాక్షన్ మోడ్ లో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.

Share post:

లేటెస్ట్