నాగచైతన్యలో అలాంటి ప్రేమను చూశాను : శోభితా ధూళిపాళ్ల

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగస్టు 8న హైదరాబాద్ లో చాలా నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. తాజాగా ఆ పోస్ట్‌ వెనక ఉన్న కారణాన్ని ఆమె ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘చై’లో ఆ ప్రేమను చూశా

“నాకు సంగం సాహిత్యం (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది (Sangam Sahityam)) అంటే చాలా ఇష్టం.  నా ఎంగేజ్మెంట్ పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం.. గతంలో ఈ సాహిత్యంలో నేను చదివినదే. హృదయాలను హత్తుకునే సందేశం ఉంది. అందుకే దానికి నా మనసులో ప్రత్యేక స్థానముంది. నేను ఎప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామి (నాగచైతన్య)లో అదే ప్రేమను చూశాను’’ అని శోభితా ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది.

శోభితా పెట్టిన పోస్టు ఇదే 

‘‘మా అమ్మ నీకు ఏం కావచ్చు? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? నువ్వు, నేను ఎలా కలిశాం? కానీ, ఈ ప్రేమలో మన హృదయాలు కలిశాయి. విడిపోవడానికి మించి కలిసిపోయాయి’’ అని శోభితా ధూళిపాళ్ల రాసుకొచ్చింది. ఇక ఈ వేడుక సింపుల్‌ (Naga Chaitanya Shobita Dhulipala Engagement)గా జరగడంపై మాట్లాడుతూ..నిశ్చితార్థ వేడుక గ్రాండ్‌గా జరగాలని తానెప్పుడూ కోరుకోలేదని తెలిపింది. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా వేడుక జరిగిందని వెల్లడించింది.

Share post:

లేటెస్ట్