రుక్మిణీ దేవిగా రీతూవర్మ..‘స్వాగ్’ సినిమాలో అదరగొట్టేసింది

ManaEnadu:పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతేకాకుండా ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. రీతు వర్మ(Ritu Varma)కు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానున్నట్లు టాక్. ప్రజెంట్ ఈ అమ్మడు ‘స్వాగ్’(Swag) తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్దంగా ఉంది.

శ్రీ విష్ణు(Sree vishnu) హీరోగా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించగా.. అక్టోబర్ 4న థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఇందులో రీతు వర్మ వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రావడంతో ‘స్వాగ్’ లో రీతు వర్మ క్యారెక్టర్‌పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ.. మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *