Telangana DSC Results : తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌

Mana Enadu : లక్షలాది మంది అభ్య‌ర్థులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించిన తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలను (Telangana DSC Results) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. జులై 18వ తేదీ నుంచి ఆగ‌స్టు 5వ‌ తేదీ వర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప‌రీక్షలు నిర్వహించారు. 2.45 ల‌క్ష‌ల మందికి పైగా ఈ పరీక్షలు రాశారు.
తొలిసారిగా ఆన్ లైన్ పరీక్ష
11 వేల 62 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 13వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి.. సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీని రిలీజ్ చేసింది.
మరో మూడు నెలల్లో నియామకాలు
ఇక తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల విడుదల అనంతరం ఖాళీల సంఖ్య ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీల (డీఎస్సీ)కు రాష్ట్ర విద్యాశాఖ రూపొందిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *