Mana Enadu: యూజర్లకు యూట్యూబ్(YouTube) గుడ్‌న్యూస్ చెప్పింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటోంన్న ఈ సోషల్ మీడియా(Social Media) ప్లాట్ ఫామ్ మరో బిగ్ అప్డేట్ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో 15 సెకండ్ల నిడివి ఉండే వీడియోలనే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే యూజర్ల(Users)కు కొత్త ఆఫ్షన్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా క్రియేటర్లు 3 నిమిషాల నిడివి గల వీడియో(3 minute videos)లను అప్లోడ్ చేసేందుకు ఈ ఫీచర్(Feature) అనుమతిస్తుంది. అక్టోబర్ 15, 2024 నుంచి ఈ అప్డేట్(Update) అందుబాటులోకి రానుంది.

లాంగ్ వీడియోలపై దృష్టి
సాధారణంగా గతంలో, యూట్యూబ్ షార్ట్స్(YouTube Shorts) సాధారణంగా ఒక నిమిషం లోపు ఉండే లాంగ్ వీడియో(Long videos)లపై దృష్టిపెట్టింది. ఈ షార్ట్ వీడియోలు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్(TikTok, Instagram) రీల్స్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో యూట్యూబ్ పోటీపడుతోంది. అయితే, ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లాంగ్ వీడియోలకు సపోర్టు అందించనుంది. దీంతోపాటు ఎక్కువ వీడియో నిడివితో పాటు, కంటెంట్ క్రియేటివ్(Content is creative) మరింత ఆకర్షణీయంగా చేయడానికి యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో టూల్ టెంప్లేట్లను అందిస్తుంది. షార్ట్‌లో “రీమిక్స్(Remix)” బటన్‌ను ట్యాప్ చేసి ‘Use This Template’ ఎంచుకోవడం ద్వారా ట్రెండింగ్ వీడియోలను సులభంగా రీమిక్స్ చేసుకోవచ్చు.
వైరల్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్లాన్
రాబోయే నెలల్లో రిలీజ్ అయ్యే మరో అప్డేట్ షార్ట్(Update shorts)లలో మరిన్ని యూట్యూబ్ కంటెంట్‌ని ఇంటిగ్రేట్ చేయనుంది. క్రియేటర్లు త్వరలో తమ షార్ట్‌లను క్రియేట్ చేసేందుకు మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ యూట్యూబ్ వీడియోల నుంచి క్లిప్‌లను వినియోగించవచ్చు. అంతేకాకుండా, గూగుల్ డీప్‌మైండ్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్(Google DeepMind Advanced Video Model), వియో కూడా ఈ ఏడాది చివర్లో షార్ట్స్‌లో మెర్జ్ కానుంది. క్రియేటర్లకు మరింత పవర్ఫుల్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్టాండెడ్ క్లిప్‌లను అందిస్తుంది. అలాగే వైరల్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా యూట్యూబ్ కొత్త “షార్ట్‌ల ట్రెండ్లు” పేజీని కూడా ప్రారంభించనుంది. దీంతో యూజర్లను వీలైనంత ఎక్కువకాలం తమ ప్లాట్ ఫామ్‌లోనే గడిపేలా యూట్యూబ్ ప్లాన్ చేస్తున్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.






