Mana Enadu : ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ సినిమాల సూపర్ హిట్ తర్వాత టాలీవుడ్ యంగ్ నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వాగ్ (Swag)’. మీరా జాస్మిన్, రీతూవర్మ, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? శ్రీవిష్ణుకు హ్యాట్రిక్ అందించిందా లేదా చూద్దాం.
రేటింగ్-2.5/5
నటీనటులు: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, వడివుక్కరసి, గోపరాజు రమణ, సునీల్, రవిబాబు, గెటప్ శీను, పృథ్వీ, శరణ్య, ప్రదీప్.
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: వేదరామన్ శంకరన్
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
రచన-దర్శకత్వం: హాసిత్ గోలి
స్టోరీ : స్వాగణిక వంశ వారసత్వం చుట్టూ సాగే ఈ కథలో ఆ వంశానికి వారసత్వంగా ఓ నిధి ఉంటుంది. నిజమైన ఆ వంశ వారసుడికే ఆ నిధి దక్కాలని ప్రయత్నిస్తున్న ఓ కుటుంబం.. ఆ వారసుడి కోసం వెతుకుతుంటుంది. ‘స్వాగణిక వంశ వారసుడివి నువ్వే.. వెళ్లి ఆ నిధి తెచ్చుకో..’ అంటూ కొందరికి ఉత్తరాలు అందడంతో ఆ సంపద మాదే నంటూ, మేమే నిజమైన వారసులమంటూ.. భవభూతి(శ్రీవిష్ణు), అనుభూతి(రీతూవర్మ), సింగ (శ్రీవిష్ణు) ఈ ముగ్గురు వెళ్తారు. ఈ స్వాగణిక వంశ స్టోరీ ఏంటి? నిజానికి ఈ వారసత్వ సంపద ఎవరిది? అసలైన వారసుడు ఇంకెవరైనా ఉన్నారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కథ ఎంత గొప్పదైనా.. దాన్ని ప్రేక్షకుడికి ఈజీగా అర్థమయ్యేలా చెబితేనే సినిమా రక్తి కడుతుంది. కానీ స్వాగ్ విషయంలో అదే మిస్ అయింది. ఈ కథలో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, ప్రేక్షకులను కనెక్ట్ చేసే ఎమోషన్ ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేసేలా చెప్పడంతో దర్శకుడు ఫెయిల్ అయినట్లు అనిపించింది. కన్‌ఫ్యూజన్ డ్రామా తెరకెక్కించినప్పుడు స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్త పడాలి. కానీ ఈ సినిమాలో ఏ పాత్ర ఎక్కడి నుంచి ఎందుకొచ్చిందో, ఎందుకలా ప్రవర్తిస్తుందో, వాటి లక్ష్యమేమిటో ఒక పట్టాన అర్థం కాదు. అంతా గజిబిజి వ్యవహారమే. ఈ సినిమాలో తాను అనుకున్న కథను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పే విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ట్రైలర్ లో రెండుమూడు జోకులు నవ్వించాయి. సినిమాలో అవి మాత్రమే ఉంటాయి.
ఎవరెలా చేశారంటే ? : ఈ మధ్య కామెడీతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్న శ్రీవిష్ణు (Sree Vishnu Movie)… ఇందులో బోలెడన్ని గెటప్పులతో, విచిత్రమైన హావభావాలు, డైలాగ్ డిక్షన్‌తో ఎన్ని విన్యాసాలు చేసినా.. ప్రేక్షకుడికి నవ్వు రాదు. ఓవైపు స్టోరీ అర్థంగాక మరోవైపు కామెడీ లేక ‘శ్వాగ్’ (Swag Movie) కాస్త సాగదీతగా మారింది. శ్వాగణిక రాజు, సింగరేణి అలియాస్ సింగ పాత్రలు శ్రీవిష్ణుకు కొట్టిన పిండే అనిపిస్తాయి.
మిగతా పాత్రలు, గెటప్పుల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. మరో కొత్త పాత్రలో శ్రీవిష్ణు (Sree Vishnu) ఒదిగిపోయిన విధానం, అందులో నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీతూ వర్మ (Ritu Varma) కూడా భిన్న కోణాల్లో తెరపై కనిపించినా.. కానీ ఆ పాత్రలో బలం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన మీరాజాస్మిన్ నటన ఆకట్టుకుంటుంది.
దర్శకుడు హసిత్ హోలి కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. స్టోరీలో బలమైన పాయింట్ ఉంది. కానీ దాన్ని చెప్పిన తీరు ఆసక్తిగా లేదు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. వేదరామన్ కెమెరా పనితనం మాత్రం అద్భుతం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బాగానే ఖర్చు పెట్టారు.
బలాలు
- మంచి మెసేజ్
- శ్రీవిష్ణు నటన
బలహీనతలు
- గందరగోళంగా సాగిన స్టోరీ, స్క్రీన్ ప్లే
- కొరవడిన కామెడీ
కన్ క్లూజన్ : శ్వాగ్… ఓ సాగదీత






