బస్తర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టుల మృతి

Mana Enadu : ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. నారాయణ్‌పుర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) జరిగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

14 మంది మావోయిస్టులు మృతి

బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ – నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మాడ్‌ దండ కారణ్యంలోని తుల్‌తులి, నెందూర్‌ గ్రామాల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ మీడియాకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ అనంతరం 14 మంది మావోయిస్టుల (Naxals) మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

భద్రతా బలగాలపై మావోయిస్టుల కాల్పులు

“ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్‌ ప్రాంతంలో 171 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. మా భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈరోజు మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు షురూ చేశారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మరణించారు.” అని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *