పవర్ ఫుల్ పోలీసు పాత్రలో వెంకట్ ‘హరుడు’.. గ్లింప్స్ చూశారా?

Mana Enadu : ‘కాలానికి లొంగని బలమా.. కలహానికి ఓడని తనమా.. నా పోరాటానికి తోడు నీవే ప్రేమ’ అంటూ ‘సీతారాముల కల్యాణం చూతము రారండి (Sree Seetharamula Kalyanam Chothamu Rarandi)’ అనే సినిమాలో ప్రియురాలి కోసం పాట పాడినా.. ‘శివరామరాజు’లో అన్న గీసిన గీత దాటని తమ్ముడిగా, చెల్లెలి కోసం ప్రాణమైనా ఇచ్చే అన్నగా అలరించాడు నటుడు వెంకట్. చాలా ఏళ్ల తర్వాత ఆయన హీరోగా మరో తెలుగు సినిమా చేస్తున్నాడు.

‘హరుడు(Harudu – The Destroyer) చిత్రంతో త్వరలోనే వెంకట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హెబ్బా పటేల్, సలోని, నటాషా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని రాజ్ తళ్లూరి తెరకెక్కిస్తున్నారు. 

డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో వెంకట్ శంకర్ అనే పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించాడు. ‘మంచి చేసే వాళ్లకు నా పేరు డీసీపీ శంకర్.. అదే ఎక్స్ ట్రా చేసే నా కొడుకులకు నా పేరు ఎన్ కౌంటర్ శంకర్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ గ్లింప్స్ లో వెంకట్ పాత్ర ఎంట్రీని చూడొచ్చు. ఇక ‘గల్లీలు, ఏరియాలు కుక్కలకు, పందులకు ఉంటాయ్ రా.. సిటీ మొత్తం సింహందే’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచింది. 

ఇక గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని అన్నారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయని తెలిపారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ, హీరో వెంకట్ (Actor Venkat) తో ఐదేళ్ల పాటు జర్నీ చేశానని చెప్పారు. లవర్ బాయ్ గా ఉన్న ఆయన ఇమేజ్ ఈ సినిమాతో మాస్, కమర్షియల్ గా మారిపోతుందని తెలిపారు. 

హీరో వెంకట్ మాట్లాడుతూ.. “హరుడు (Harudu Movie Glimpse) చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయి. నిర్మాత డాక్టర్ అయినా… సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్  ఇచ్చారు దర్శకుడు రాజ్. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు దీటుగా హెబ్బాపటేల్ పాత్ర ఉంటుంది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం.” అని చెప్పారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *