రాజమౌళి మూవీలో ఛాన్స్ వచ్చేలా నటిస్తా : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Mana Enadu : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) హీరోగా నటించిన సినిమా “రామ్ నగర్ బన్నీ (Ramnagar Bunny)”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణీ, రీతూ మంత్ర హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించారు. ఈనెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపత్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.

చంద్రహాస్ అదిరిపోయేలా నటించాడు

ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెబుతున్నారని.. చంద్రహాస్ బాగా నటించాడని, డ్యాన్స్ లు , ఫైట్స్ బాగా చేశాడని చెబుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 100 పర్సెంట్ పాజిటివ్ గా స్పందిస్తున్నారని.. మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయని తెలిపారు. ఇంత మంచి టాక్ వస్తున్నప్పుడు మూవీకి మరిన్ని థియేటర్స్ పెంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. 

మా సినిమా చాలా బాగా వచ్చింది

హీరోయిన్ రీచా జోషి (Richa Joshi) మాట్లాడుతూ- “రామ్ నగర్ బన్నీ” సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి టాక్ వస్తోంది. రివ్యూస్ చాలా బాగున్నాయి. మా మూవీ రిలీజ్ ముందు ప్రతి కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వచ్చిందో..ఇప్పుడు థియేటర్స్ లోనూ అలాంటి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీ షో కు వచ్చిన వారంతా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీకెండ్ లో ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడండి. అని అన్నారు.

రామ్ నగర్ బన్నీకి మంచి రివ్యూస్ వస్తున్నాయ్

“రామ్ నగర్ బన్నీ” సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్ రీతూ మంత్ర.  తెలుగులో తన ఫస్ట్ మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. డ్యాన్స్, ఫైట్స్, లవ్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీరు కోరుకునే ప్రతి అంశం ఈ మూవీలో ఉందని అన్నారు. మరోవైపు హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు వస్తున్న టాక్ తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నామని.. మంచి రివ్యూస్ వస్తున్నాయని అన్నారు.

 మా “రామ్ నగర్ బన్నీ” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలే సక్సెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నాయి. అలాంటిది కొత్త హీరో, కొత్త నిర్మాత, చిన్న బడ్జెట్ లో రామ్ నగర్ బన్నీ మూవీని రూపొందించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సక్సెస్ ను మాకు అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అని డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) అన్నారు.

రాజమౌళి ఛాన్స్ ఇచ్చేలా నటిస్తా

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ..   “రామ్ నగర్ బన్నీ” సినిమాకు మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు. తమ సినిమా నచ్చకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ప్రామిస్ చేశానని.. 95 పర్సెంట్ ప్రేక్షకులకు మూవీ నచ్చిందని అన్నారు. ఈ సినిమ తన డెబ్యూ మూవీ కాబట్టి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని చేశానని వెల్లడించారు. నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి నాకు అవకాశాలు ఇచ్చేలా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నానని చెప్పారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *