Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం

ManaEnadu:టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. అర్దరాత్రి సుమారు 1గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

రాజేంద్రప్రసాద్‌ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్‌ అయ్యారు. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు. ‘నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే, నాకు కూతురు (గాయత్రి ) పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనతో మాటలు లేవు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *