బిగ్​బాస్​ ఇంట్లోకి తుపాను​లా ‘వైల్డ్​ కార్డ్ ఎంట్రీస్’.. ఎవరెవరంటే?

ManaEnadu:బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ లో ట్విస్టులు, టర్న్ లు విపరీతంగా ఉండబోతున్నాయంటూ హోస్టు నాగార్జున ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అన్‌లిమిటెడ్‌ అని చెబుతూనే వస్తున్నారు. అయితే ప్రోమోలకు తగ్గట్లుగా.. నాగార్జున క్రియేట్ చేస్తున్న హైప్ కు తగ్గట్టుగా షో ఉండకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టీమ్ త్వరగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆడియన్స్​ను ఎంటర్​టైన్​ చేసేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను రంగంలోకి దింపాలని డిసైడ్ అయింది.

బిగ్​బాస్​ ఇంట్లోకి వైల్డ్ కార్డ్స్

గత వారమే బిగ్ సర్ ప్రైజ్ అంటూ హోస్టు నాగార్జున వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక తాజాగా మొత్తంగా ఎనిమిది మందిని ఇంట్లోకి పంపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్ కు తగ్గట్టుగా బిగ్ బాస్ హౌజులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్ మేట్స్ అడ్డుకునేందుకు బిగ్ బాస్ స్పెషల్ టాస్కులను కూడా ప్రిపేర్ చేశాడు. అయితే ఇంతకీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు.. ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇయ్యబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ లిస్టు వైరల్ అవుతోంది. ఆ లిస్టులో ఎవరు ఉన్నారంటే..?

తుపానులా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా లాంఛ్​ అయిన బిగ్​బాస్​ సీజన్​ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా..  బేబక్క, శేఖర్​ బాషా, అభయ్​ నవీన్​, సోనియా ఆకుల, ఆదిత్య ఎలిమినేట్​ అయ్యారు. ఈ ఆదివారం మరొకరు ఎలిమినేట్​ కానున్నారు. ఇక ఇవాళ్టి (శనివారం) ఎపిసోడ్లో నాగార్జున కూడా” తుఫాను రాబోతోంది. వైల్డ్ కార్డ్స్ ఒకరి తర్వాత ఒకరు రానున్నారు. మీరు వైల్డ్‌గా లేకపోతే వాళ్లను తట్టుకోలేరు” అంటూ కంటెస్టెంట్లను మరింత టెన్షన్ పెట్టారు. ఇక ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్టు ఇదే.. 

వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ లిస్ట్​ చూస్తే:

హరితేజ (బిగ్​బాస్ సీజన్-1 కంటెస్టెంటు)

రోహిణి (బిగ్​బాస్ సీజన్ -3 హౌస్ మేట్)

అవినాష్ (బిగ్​బాస్ సీజన్ -4 కంటెస్టెంట్)

గౌతమ్ కృష్ణ (బిగ్​బాస్ సీజన్ -7 హౌస్ మేట్)

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *