Devdas: అమ్మ కోసమే ఆ సినిమా చేశా: షారుక్ ఖాన్

Mana Enadu: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌(Shahrukh Khan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్(Fanbase) సొంతం చేసుకున్నాడు షారుక్. ఐదు పదుల వయస్సులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. సినిమాలో పాత్ర ఎలాంటిదైనా, గెటప్ ఏదైనా అందుకు తగ్గట్లుగా షారుక్ మారిపోతుంటాడు. ముఖ్యంగా ఫైట్ సీన్స్, డాన్స్‌తో విపరీతంగా ఆకట్టుకుంటారు. ఏజ్ పెరిగినా తనలో యాక్టింగ్స్ స్కిల్స్(Acting Skills) ఇంకా తగ్గలేదని, కుర్ర హీరోలకు ధీటుగా పోటీనిస్తుంటాడు ఈ బాలీవుడ్ బాద్ షా. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ(Interview)లో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా అది

షారుక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దేవ‌దాస్(Devdas). 2002లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌(Box Office)ను షేక్ చేసింది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ(Sanjay Leela Bhansali) తెర‌కెక్కించిన మ‌రో గొప్ప చిత్ర‌మ‌ది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షారుక్ ఈ సినిమా నటించిన నాటి క్షణాలను గుర్తు చేసుకున్నారు. దేవ‌దాస్ సినిమా చేయ‌డానికి కార‌ణం అమ్మ‌. ఆ సినిమాలో నా న‌ట‌న చూసి ఆమె గ‌ర్వ‌ప‌డాల‌నుకున్నా. దిలీప్ కుమార్(Dileep kumar), కె.ఎల్ సైగ‌ల్(KL Sihal) వంటి న‌టులు ఆ పాత్ర‌లు పోషించారు. వారిలా నేను న‌టించ‌ల‌నేని చాలా మంది న‌న్ను దేవ‌దాస్ అంగీక‌రించొద్దు అన్నాడు షారుక్(Shahrukh).

 అనేక సంద‌ర్భాల్లో ఆవేద‌న చెందా: షారుక్

దేవ‌దాస్ రిలీజ్ త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ నా మీద ప్ర‌శంస‌లు కురిపించారు. కానీ ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో నేను ఎంతో ఆందోళ‌న‌(Pressure)కు గుర‌య్యాను. మ‌ద్యం తాగ‌డం అల‌వాటు చేసుకున్నా. బ‌హుశా ఆ అల‌వాటే నాకు ఉత్త‌మ న‌టుడి(Best Actor) అవార్డు తెచ్చిందేమో` అని షారుక్ ఖాన్ స‌ర‌దాగా అన్నాడు. `దేవ‌దాస్`లో ఐశ్వ‌ర్యారాయ్(Aishwarya Rai)- మాధురి దీక్షిత్‌(Madhuri Deekshit)లు హీరోయిన్ల‌గా న‌టించారు. షారుక్ ఖాన్ త‌ల్లిదండ్రులు కెరీర్ ప్రారంభానికి ముందే క‌న్నుమూశారు. త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో షారుక్ ఖాన్ అనేక సంద‌ర్భాల్లో ఆవేద‌న చెందానని తెలిపాడు షారుక్.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *