Ram Lakshman: ఫైట్స్‌తో రఫ్ ఆడించడమే కాదు.. కాపాడటమూ తెలుసంటున్న ఫైట్ మాస్టర్స్!

Mana Enadu: ఫైట్స్‌తో రఫ్ ఆడించడం మాత్రమే కాదు.. సాయం కోరి వచ్చిన వారికి సాయమూ చేస్తామంటున్నారు ఫైట్ మాస్టర్స్(Fight Masters) రామ్‌లక్షణ్ (Ram Lakshman). టాలీవుడ్‌లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోల మూవీలకు ఫైట్ మాస్టర్స్‌(Fight Masters)గా వ్యవహరించారు. ఇలా ఎన్నో హిట్ మూవీలను తమ అకౌంట్లో వేసుకున్నారు. వందలకొద్దీ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్, రామ్ చరణ్‌ వంటి స్టార్లతో పాటు కొత్తతరం హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు. ఇందుకుగానూ వీరిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.

సొంత ఖర్చులతో సాయమందించారు

తాజాగా ఈ సినీ ఫైట్ మాస్టర్స్ గొప్ప మనసును చాటుకున్నారు. భారీ కొండరాళ్ల మధ్య చిక్కుకున్న శునకాన్ని(Saves Dog) రక్షించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్(natizens) వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాస్టర్స్ గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. రాళ్ల మధ్యలో ఇరుక్కున్న కుక్కను కాపాడేందుకు ఆ బండరాళ్లను కదిలించడం మనుషులతో సాధ్యం కాదని గుర్తించిన రామ్, లక్ష్మణ్‌లు వెంటనే సొంత ఖర్చులతో జేసీబీని పిలిపించారు. దాని సహాయంతో తల్లి కుక్కను కాపాడి బయటకు తీసి దాని పిల్లల చెంతకు చేర్చారు. అంతే కాకుండా వాటికి ఆహారం, నీళ్లు అందించారు.

 మొయినాబాద్‌లో స్టంట్స్ ప్రాక్టీస్

ఇక పోతే వీరిద్దరూ పలు స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం మొయినాబాద్‌లోని అజీజ్ నగర్‌లో రామ్ లక్ష్మణ్ బృందం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈడైరెక్టర్ మారుతి(Director Maruthi) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

 

Share post:

లేటెస్ట్