Love Reddy: సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ ఫెయిల్యూర్‌ మీట్‌! ఎందుకో తెలుసా?

Mana Enadu: చిత్ర పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు కొదవేలేదు. నిత్యం ఎంతో మంది యువ నటీనటులు వెండితెరకు పరిచయం అవుతూనే ఉన్నారు. అదే కోవలోకి చేరుతారు ఈ యంగ్ యాక్టర్స్ అంజన్ రామచంద్ర, శ్రావణి(Anjan Ramachandra, Shravani). తాజాగా వీరిద్దరూ జంటగా నటించిన మూవీ ‘లవ్ రెడ్డి(Love Reddy)’. ఈ సినిమాకు స్మరణ్ రెడ్డి(Director Smaran Reddy) డైరెక్షన్ వహించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, MGR ఫిలిమ్స్ బ్యానర్స్‌పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. యథార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్(Box office) వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ విడుదల రెండో రోజే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌కు ఫెయిల్యూర్‌ మీట్‌ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఇలా ఓ సినిమాకు ఫెయిల్యూర్‌ మీట్‌ నిర్వహించడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి.

అంతకు పదిరెట్లు పైకొస్తాం: ప్రొడ్యూసర్

ఈ సందర్భంగా మూవీపై ప్రొడ్యూసర్ మదన్ గోపాల్ రెడ్డి(Producer Madan Gopal Reddy) మాట్లాడారు. సక్సెస్ మీట్‌కి కాకుండా ఫెయిల్యూర్‌ మీట్‌ కూడా వచ్చిన అభిమానులు, మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. ఈ నిర్ణయం తనదని మా డైరెక్టర్ గెలిచాడు, మా హీరో, హీరోయిన్లు గెలిచారని చెప్పుకొచ్చారు. నిజంగా సినిమా హిట్ అని, ఫ్రీ షోలు వేసినా.. అభిమానులు తమ సమయాన్ని కేటాయించి సినిమా చూశారన్నారు. ఫెల్యూర్(Failure) చూసినవాడు ఎప్పుడూ కిందకు వెళ్లడని, దానిని తొక్కుకుంటూ పదిమెట్లు పైకొస్తానని చెప్పాడు. డైరెక్టర్ స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్(Blockbuster Hit) అయిందని, కాకపోతే ప్రేక్షకుల్లోకి అనుకున్నంత మేర తీసుకెళ్లలేకపోయాని అన్నారు.

 కొత్తవాళ్లం అయినా అందరం బాగా చేశాం: హీరోయిన్ శ్రావణి

హీరోయిన్ శ్రావణి మాట్లాడుతూ.. తామంతా కొత్తవాళ్లం అయినా బాగా చేశారని వేలల్లో మెసేజ్‌(MSG’S)లు వస్తున్నాయని అన్నారు. సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ ఒకప్పుడు కొత్తగా వచ్చిన వారేనని తెలిపారు. హీరో రామచంద్ర(Ramachandra) మాట్లాడుతూ.. సినిమా చూసిన వారంతా సూపర్‌గా ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. చూడని వారు కూడా ‘లవ్ రెడ్డి’ని చూసి ఆదరించాలని కోరారు.

Share post:

లేటెస్ట్