Mana Enadu: భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్(Indian Women’s Cricket Team) అదరగొట్టింది. ఆల్‌రౌండర్ దీప్తిశర్మ (41, 1/35) ఆల్‌రౌండ్ షోతో అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా న్యూజిలాండ్(New Zealand)తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(3 match ODI series)లో భారత్ 1-0తో లీడ్ సాధించింది. మోదీ స్టేడియంలో జరిగిన మొదటి ODIలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది. ఛేదనలో కివీస్ 40.4 ఓవర్లలో 168 రన్స్‌కే కుప్పకూలింది.
కొత్త ప్లేయర్లు అదరగొట్టారు
భారత జట్టు బ్యాటింగ్‌లో యంగ్ ప్లేయర్ తేజల్ హసబ్నిస్ (42), దీప్తి, యస్తికా భాటియా (37) రాణించారు. జెమీమా (35), షెఫాలి వర్మ (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా ఈ మ్యాచ్‌కు హర్మన్ ప్రీత్(Harman Preet) దూరమడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న స్మృతి మంధాన (5) విఫలమైంది. కివీస్ బౌలర్లలో అమేలియా కేర్ (4/42), జెస్ కెర్ (3/49) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. ఎడమచేతి స్పిన్నర్ రాధ యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకోర్ (2/26) ధాటికి 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా రెండో ODI ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.
కాగా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్స్ T20 ప్రపంచ కప్ 2024 (ICC WT20 WC 2024)ను న్యూజిలాండ్ ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ (New Zealand), సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ చరిత్రలోనే తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే.
W.0.0.W 😎
An over filled with fielding brilliance 🤩
First Saima Thakor with the catch and then Captain Smriti Mandhana with a direct-hit 🔥
Live – https://t.co/VGGT7lSS13#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/dyD8tkK07K
— BCCI Women (@BCCIWomen) October 24, 2024








