బాలీవుడ్ ‘రామాయణ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్​మెంట్

ManaEnadu : ‘రామాయణం’ ఇతిహాసంపై భారతీయ భాషల్లో ఇప్పటికే వందల సినిమాలు తెరకెక్కాయి. అయినా ఇంకా ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా హిందీలోనూ రామాయణం (Ramayanam)పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక అప్డేట్స్ రాలేదు.

రెండు భాగాలుగా రామాయణ
అయితే తాజాగా బాలీవుడ్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ (Ramayana)’ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్​ను రివీల్ చేశారు. రామాయణ పార్ట్-1 వచ్చే ఏడాది (2026) దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

రామయణ నటులు వీళ్లే!
బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నితీశ్ తివారీ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక సీతగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) నటించనుంది. రావణాసురుడి పాత్రలో కేజీయఫ్ ఫేమ్ యశ్ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్‌ అయ్యాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *