Mana Enadu: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) దసరా పండగ రోజు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో కొత్త మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘దసరా(Dussehra)’ తో భారీ సక్సెస్ అందుకున్న ఈ కాంబోలో తెరకెక్కనున్న రెండో సినిమా ఇది. డైరెక్టర్ శ్రీకాంత్ ఈసారి నాని కోసం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ కథ(A periodical story)ని సిద్ధం చేశారు. తాజాగా ఈ మూవీ కొత్త పోస్టర్(new poster)ను నాని విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో నాని సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor), శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.
ఆ మూవీకి రూ.110కోట్లకు పైగా కలెక్షన్స్
కాగా ఇటీవల నాని, ప్రియాంకా మోహన్(Nani, Priyanka Mohan) జంటగా ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ(Vivek Atreya) దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటించగా సూర్య పాత్రకు బాగా పేరొచ్చింది. సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లి బాక్సాఫీస్(Boxoffice) వద్ద రూ.110కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.
డిఫరెంట్ టైటిల్
‘దసరా’ మూవీతో పోలిస్తే వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ అని ఇప్పటికే మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ను ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. “ది ప్యారడైజ్(The Paradise)” అనే టైటిల్ తో నాని, శ్రీకాంత్ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన సోషల్ మీడియా(Social media) వేదికగా పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ గమనిస్తే.. టైటిల్ అక్షరాల్లో కింద ఎక్కువ మొత్తంలో గన్నులు కనిపిస్తున్నాయి. అలాగే టైటిల్ సైతం ఎరుపు రంగులో ఉంది. దీన్ని బట్టి ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.
YES.#THEPARADISE
A Srikanth Odela Film. pic.twitter.com/wnBPrVrlMG— Nani (@NameisNani) November 6, 2024






