Devara OTT: ‘దేవర’ వచ్చేశాడు.. అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌

ManaEnadu: నందమూరి స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కొరటాల శివ(Koratala Shive) కాంబోలో వచ్చిన మూవీ దేవర:పార్ట్ 1(Devara). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా SEP 27న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) విలన్​గా కనిపించారు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీపై అదే హైప్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్​వైడ్​గా రూ.550 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా మూవీ రిలీజై 40 రోజుల త‌ర్వాత ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు (Devara OTT ) వ‌చ్చింది.

 త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్

యంగ్ టైగర్ NTR అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. NTR నటించిన ‘దేవర’ ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix తెలిపింది. కాగా టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. యువసుధ ఆర్ట్స్, NTR ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌(Nandamuri Kalyan Ram)లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

 కథ ఏంటంటే..

ఎర్ర సముద్రం(Red Sea) తీరంలోని రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర(Devara) భయానికే భయం పుట్టించేంత వీరుడు. త‌న మాటే శాసనంగా ఉంటుంది. బ్రిటీష్‌ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. కాల‌క్ర‌మంలో ఆ ప్రాంత వాసులు త‌మ జీవ‌నోఫాధి కోసం కోస్ట్‌గార్డులకు చిక్కకుండా సముద్ర మార్గం(sea ​​route)లో అక్రమ రవాణా చేసి డ‌బ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఓ రోజు ఆ అక్ర‌మ ర‌వాణా(
Illegal transportation) వ‌ల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి దేవ‌ర ఆక్ర‌మ ర‌వాణా ప‌నిని బందు చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. అందుకు భైర (సైఫ్‌ అలీఖాన్‌) అంగీకరించడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం(War) మొదలవుతుంది. మిగతా స్టోరీ తెలియాలంటే ఓటీటీలోకి వచ్చేసిన ఫుల్ మూవీని చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *