Kanguva Pre-Release Event: ప్చ్.. సూర్యతో సినిమా చేసే అవకాశం మిస్సయ్యా: రాజమౌళి

ManaEnadu: తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న లేటెస్ట్ సినిమా కంగువా(Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీని డెరెక్టర్ శివ(Shiva) తెరకెక్కించాడు. పాన్ ఇండియా లెవల్‌లో రానున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువాలో సూర్యకు జోడీగా దిశా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రల్లో నటించ‌గా.. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై KE జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నేపథ్యంలో కంగువా ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre release event) హైద‌రాబాద్‌లో జరిగింది. దీనికి SS రాజ‌మౌళి, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, సురేశ్ బాబు, విశ్వ‌క్‌సేన్‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బోయ‌పాటి శీను తదితరులు హాజ‌ర‌య్యారు.

 సూర్య కష్టాన్ని చాలాసార్లు గ‌మ‌నించా: రాజ‌మౌళి

ఈ సందర్భంగా దర్శకవీరుడు రాజ‌మౌళి మాట్లాడారు. తాను సూర్య స్ఫూర్తితోనే నేను పాన్ ఇండియా సినిమా(Pan India Movies)ల‌ వైపు కదిలానని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న ప‌ని తీరును, సినిమా ప్ర‌మోష‌న్(Promotions) కోసం అత‌ను ప‌డు క‌ష్టాన్ని చాలాసార్లు గ‌మ‌నించానంటూ ఆయ‌న‌ను ఆకాశానికెత్తేశారు. తెలుగు సినిమాను కేవ‌లం AP, తెలంగాణ‌ రాష్ట్రాలలోనే ఉంచ‌కుండా బ‌య‌టి ప్రపంచానికి తీసుకురావ‌డానికి కార‌ణం వ‌న్ ఆఫ్ ది మెయిన్ రీజ‌న్ సూర్య అని రాజమౌళి చెప్పారు.

నేనే ఛాన్స్‌ మిస్‌ అయ్యా: సూర్య

ఓ త‌మిళ‌ నటుడు తెలుగు ప్రేక్షకుల(Telugu audience)కు ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మ‌నం కూడా అక్క‌డికి వెల్లి ప్ర‌మోష‌న్స్ చేయాల‌ని ప‌క్క నున్న వారికి చెప్పేవాడిన‌ని అలా ‘బాహుబలి’ (Baahubali) సినిమాకు ఆయనే ఇన్‌స్పిరేషన్ అని అన్నారు. సూర్యతో క‌లిసి గ‌తంలో ఓ సినిమా చేయాలనుకున్నా. కానీ, కుదర్లేదు. ‘నేను అవకాశం మిస్‌ అయ్యా’ అంటూ సూర్య నా గురించి ఓ ఈవెంట్‌లో అన్నారు. ఆయన మిస్‌ అవడం కాదు.. నేనే ఛాన్స్‌ మిస్‌ అయ్యా’ అని అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *