ManaEnadu:టాలీవుడ్ డైరెక్టర్లకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ముగ్గురు డైరెక్టర్లు ఉండగా అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే గుండు. అయితే వీరు ముగ్గురూ గుండు కొట్టించుకోవడానికి కారణం ఒకటే కావడం గమనార్హం. అదే ‘బ్లాక్‌బస్టర్’. అవును ఈ ముగ్గురు తమ సినిమా గత సినిమాలతో హిట్టు కొట్టి వెంటనే తిరుమల తిరుపతిలో వేంకటేశ్వరస్వామికి తలనీలాలు అర్పించారు. ఆ తర్వాత దిగిన ఫొటేలే ఇవి. అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వీళ్లంతా హిట్టు కొట్టి.. గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్నారు. ఇంతకీ ఎవరే సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశారో చూద్దామా?
‘యానిమల్’తో సందీప్‌రెడ్డి
టాలీవుడ్ ఎమర్జింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన మూవీ ‘యానిమల్’. ఆ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్ష్ సొంతం చేసుకుంది. సందీప్‌రెడ్డికి అర్జున్‌రెడ్డి రేంజ్‌లో హిట్టు ఇచ్చిందీ మూవీ. అందుకే ఆయన తిరుపతి వెళ్లి బాలాజీకి మొక్కు చెల్లించుకున్నాడు. ఎప్పుడు చూసినా పొడవైన జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో కనిపించే సందీప్‌రెడ్డి వంగా సడన్‌గా కొత్త లుక్‌లో కనిపించేసరికి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.
‘కల్కి’తో నాగ్
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ ‘కల్కి’. దాన్ని డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింప్లిసిటీకే సింప్లిసిటీలా ఉంటాడు. ‘కల్కి’తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కూడా హిట్టు ఇచ్చాడు నాగీ. మరి అంత పెద్ద హిట్టు కొట్టాక వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకోకపోతే ఎలా? పైగా ఆయన తీసింది మైతాలజీ డ్రామా. ఇంకేముంది వెంటనే తిరుపతి బాటపట్టి ఇలా గుండుతో ప్రత్యక్షమయ్యాడు.
‘లక్కీ భాస్కర్’తో వెంకీ అట్లూరి
ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సినిమాల్లో పాజిటివ్ టాక్ ఉన్న టాప్3 సినిమాల్లో ‘లక్కీ భాస్కర్’ ఒకటి. అయితే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను పెట్టి తీసిన ఈ మూవీ తెలుగు సినిమాలను తట్టుకొని నిలవడం మామూలు విషయం కాదు. అందుకే ఈ మూవీని రూపొందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కుగా గుండు కొట్టించుకున్నాడు. భవిష్యత్తులోనూ ఇలాగే హిట్లు ఇవ్వాలని వారంతా శ్రీవారిని మొక్కుకున్నారు.






