ManaEnadu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్న 1574 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు పలువురు కీలక ప్లేయర్లను వేలానికి వదిలేయడంతో ఈ సారి జరిగే ఆక్షన్(Auction) రసవత్తరంగా సాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో KKRను గత సీజన్లో విజేత నిలిపిన శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ రిషభ్ పంత్, లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు సారథ్యం వహించిన KL రాహుల్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురుపైనే వేలంలో అందరి చూపు ఉంటుందనేది మాత్రం కాదనలేని నిజం. ఈ నేపథ్యంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలో నిలిచిన భారత ప్లేయర్లను ఓ సారి చూద్దాం…
ఈసారి సౌదీ అరేబియాలో వేలం
ఈసారి IPL వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఈ వేలంలో భారత్ నుంచి 1165 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే 409 మంది విదేశీ ప్లేయర్లు(Foreign players) వేలానికి నిలిచారు. మొత్తం ప్లేయర్లలో 320 అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు(Uncapped players) ఉన్నారు. మరో 30 మంది ఆటగాళ్లు అసోసియేట్ నేషన్స్(Associate Nations)కు చెందినవారు. కాగా IPL రూల్స్ ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ జట్టులో 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. ఇక 409 మంది విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా నుంచి 91 మంది, ఆస్ట్రేలియా 76, ఇంగ్లండ్ 52 మంది వేలంలో నిలిచారు. ఇక గరిష్ఠ బేస్ ధర రూ.2 కోట్ల లిస్టులో ఉన్న భారత ప్లేయర్లను ఓ సారి పరిశీలిస్తే..
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్న భారత ఆటగాళ్లు
KL రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, T.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, హర్షల్ పటేల్
అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ. మరి వీరిలో ఎవరు జాక్ పాట్ కొడతారో.. ఎవరికి నిరాశ ఎదురవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.








