Union Budget : వచ్చే నెల రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలమ్మ భేటీ

Mana Enadu : వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Union Budget) కోసం కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కసరత్తు షురూ చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman). ఇందులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అవ్వాలని నిర్ణయించారు. డిసెంబర్ 21-22వ తేదీల్లో ఈ సమావేశం ఉండనున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లో ఈ సంప్రదింపులు జరగనున్నట్లు తెలిసింది.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారత్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ పద్దుకు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు తెలియజేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. అదే సమయంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meet) కూడా ఉండే అవకాశం ఉంది. ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం.

జీఎస్టీ తగ్గించడం వైపే మొగ్గు

అయితే ఈ జీఎస్టీ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంల(Health Insurance Premium)పై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ (GST council) సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు.  దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి.. బిహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలో ఏర్పాటైన .. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది. జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించడం పైనే మంత్రుల బృందం మొగ్గుచూపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *