ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా.. నలుగురు ఫ్రెండ్స్ ఓచోట చేరినా పార్టీ(Party) పక్కా. ఇక ఇలాంటి స్పెషల్ ఆకేషన్స్‌లో మేయిన్‌గా ఉండాల్సిందే ఏంటంటే.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మందుపార్టీ.. మందులేనిదే ముద్దదిగదు. చల్లగా ఓ బీర్(Beer) వేయకుంటే నిద్రపట్టదు. అయితే చాలా మంది లిక్కర్‌తో పోల్చితే బీర్ తాగడం ఆరోగ్యం(Health)పై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదనే భావనలో చాలా మంది ఉంటారు. ఇంతకీ బీర్ తాగడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా.. అసలు బీర్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో.. ఓ లుక్ వేద్దామా..
ఊబకాయంతో తిప్పలు తప్పవు
రెగ్యులర్‌గా బీర్ తాగడం ఆరోగ్యాని(Health)కి మంచిది కాదని నిపుణులు(Experts) చెబుతున్నారు. బీరు ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం(obesity) వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా బీర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి అవుతుంది. దీంతో సహజంగానే ఎక్కువగా తింటుంటాం. ఇది ఊబకాయం, పొట్టకు దారి తీస్తుందని అంటున్నారు. ఇక బీరును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు సామర్థ్యం కూడా దెబ్బ తింటుందని(Brain capacity is also affected) నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్(Alcohol) న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా తాగితే వచ్చే సమస్యలివే
బీర్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి(Memory Power) తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ డిప్రెషన్(Alcohol for depression)కు దారి తీస్తుందని అంటున్నారు. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణ పట్టాలు తప్పేలా చేస్తుంది. ఇది ఒత్తిడి(Pressure) పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీర్ వల్ల మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్(Stress) పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో అల్జీమర్స్(
Alzheimer’s)కు ఇది దారి తీస్తుందని అంటున్నారు. బీర్ తాగితే నిద్రలేమికి కూడా దారి తీస్తుందని అంటున్నారు. సో.. అందుకే బీర్ తాగే వారు జర జాగ్రత్తలు పాటిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.






