భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు మంచి అవకాశం టీమ్ఇండియా(Team India) ముందు ఉంది. సఫారీలతో నాలుగు T20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. జొహన్నెస్‌బర్గ్(Johannesburg) వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, రెండో మ్యాచ్‌లో ఓడింది. ఇక మూడో మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-1లో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది.
సిరీస్ దక్కాలంటే వారంతా రాణించాల్సిందే
అయితే ఈ మ్యాచ్లో భారత్ కొన్ని ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసినా.. తర్వాత రెండు మ్యాచుల్లోనూ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపర్చాడు. అటు కెప్టెన్ సూర్య(SKY) కూడా చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. మూడు మ్యాచుల్లో కేవలం 26 రన్సే చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్, రింకూ సింగ్ పరిస్థితీ అలాగే. దీంతో సిరీస్ దక్కాలంటే వీరంతా రాణించాల్సి ఉంది.
మరోవైపు సౌతాఫ్రికా బ్యాటర్లూ ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నారు. కెప్టెన్ మార్క్రమ్(Aiden Markram), మిల్లర్, క్లాసెన్ అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. ఆ జట్టులో ఆల్ రౌండర్ జాన్సెన్(Jansen) ఒక్కడే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఇదిలా ఉండగా జొహన్నెస్ బర్గ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్(Toss) నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్(Batting) చేసే ఛాన్సుంది.
జట్లు అంచనా
ఇండియా XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, వరుణ్ చకరవర్తి.
దక్షిణాఫ్రికాXI: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్(C), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిల్ సిమెలన్, లూథో సిపమ్లా.






