గ్రూప్ 4 రిజల్ట్స్ ఔట్.. లిస్టులో మీ పేరుందో ఇలా చెక్ చేస్కోండి

Mana Enadu : గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)… గ్రూప్ – 4 ఫలితాలను (Group 4 Results 2024) తాజాగా వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ లిస్ట్​ను రిలీజ్ చేసింది. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం గురువారం రోజున ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించింది. ప్రభుత్వ యంత్రాంగంలో 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్​లో భాగంగా 8,180 పోస్టులకు 9లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొవిజినల్‌ లిస్ట్​ కోసం క్లిక్‌ చేయండి

దాదాపు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియ(Group 4 Results)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా ప్రకటించింది. మొత్తం 59 పోస్టుల ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెట్టామని కమిషన్ తెలిపింది. ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ఎంపికను రద్దు చేస్తామని కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ పేర్కొన్నారు.

2022 డిసెంబరు 1న గ్రూప్‌-4 సర్వీసు ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రకటన (Group 4 Notification 2024) (19/2022) వెలువడగా.. 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 జులై 1న రాత పరీక్షలకు 7.6 లక్షల మంది హాజరవ్వగా..  న్యాయ వివాదాలు, ఇతర సాంకేతిక కారణాలతో చాలాకాలం జనరల్‌ ర్యాంకు జాబితా వెలువడలేదు.  రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఏర్పాటైన తర్వాత .. కమిషన్.. పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు జాబితాను 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది. ఈ జాబితాలో 7,26,837 మందికి చోటు లభించింది.

ఆ తర్వాత మెరిట్‌ జాబితాను జూన్‌ 9న ప్రకటించిన టీజీపీఎస్సీ .. నియామక నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల కోసం జనరల్‌ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, దివ్యాంగులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సెలెక్ట్ చేసింది. అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల నుంచి పోస్టుల వారీగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు తీసుకుని వాటి ప్రకారం.. కమిషన్‌ తుది ఎంపికలను పూర్తి చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *