మ్యాన్ ఆఫ్ మాసెస్(Man Of Masses), నందమూరి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వచ్చిన మూవీ దేవర (Devara). ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా SEP 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు దాటినా ఇప్పటికీ అభిమానుల్లో ఈ మూవీపై క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. దీంతో కలెక్షన్ల పరంగానూ దేవర రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.550 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. OTTలోకి వచ్చినప్పటికీ పలుచోట్ల థియేటర్లలో(Theaters)నూ లాంగ్ రన్లో దూసుకుపోతోంది. తాజాగా దేవర మరో రికార్డు ఘనత సాధించింది.
పోస్టర్ రిలీజ్ చేసిన దేవర టీమ్
ఇటీవల కాలంలో సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్‌లలో ప్రదర్శనలకు నోచుకోవడం లేదు. చాలా సినిమాలు కొన్ని వారాలకు మాత్రమే థియేటర్‌లకు పరిమితం అవుతున్నాయి. కొన్ని భారీ బడ్జెట్(Heavy Budget) సినిమాలు తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి వెళ్లిపోతున్నాయి. గతంలో వంద రోజులు, 50 రోజులు థియేటర్‌లలో ఫలానా సినిమా ప్రదర్శించేవారని ఆయా హీరోల అభిమానులు(Fans) గొప్పగా చెప్పుకునే వారు. కానీ ప్రస్తుతం అటువంటి మాటలు వినబడటం లేదు. అయితే దేవర(Devara) సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పింది. దీంతో 52 కేంద్రాల్లో ఈ మూవీ 50 రోజులు ప్రదర్శితమైందని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్(Poster) విడుదల చేసింది.
ఓటీటీలోనూ దూసుకెళ్తోంది..
ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో దేవర మూవీ 50 రోజులు పూర్తి చేయడం విశేషంగా పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్ 27న బాక్సాఫీసు ముందుకొచ్చిన దేవర ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్(OTT streaming)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో దేవరని చూడలేని వారు ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఎర్రసముద్రపు అలలను మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.
Those were the days when days and centers used to be the measure of success.
After a long time seeing what #Devara has achieved with audience love after 50 days is truly heartwarming ❤️
This is the MEASURE OF UNSHAKABLE LOVE FROM THE AUDIENCE 🙏🏻
50 Days – 52 Centers.
Fear is… pic.twitter.com/ZVpQ4qq8CF— Devara (@DevaraMovie) November 14, 2024






