ఇస్రో(ISRO) రూపొందించిన సమాచార ఉపగ్రహం GSAT-20 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీనిని ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్(Space X) తాలూకా ఫాల్కన్-9 రాకెట్(Falcon-9 rocket) కక్ష్యలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ(Florida Cape Canaveral) నుంచి దీనిని ప్రయోగించారు. ఈ రాకెట్ 34 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అక్కడ నుంచి హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ(ISRO Master Control Facility) జీశాట్–20 ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది. ఈ మిషన్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రయోగానికి ముందు ఇస్రో చీఫ్ సోమనాథ్(ISRO chief Somnath) ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రూ.590 కోట్లు ఖర్చు చేసిన ఇస్రో
ఈ ప్రయోగం కోసం ఇస్రో(ISRO) దాదాపు రూ. 590 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియవచ్చింది. స్పేస్ ఎక్స్(Space X) రాకెట్ ఎందుకంటే.. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలంటే ఇస్రో.. తన సొంత ప్రయోగ వాహనం మార్క్-3(MARK-3) రాకెట్‌ను రంగంలోకి దించుతుంది. బాహుబలిగా పేరుగాంచిన ఈ రాకెట్ 4000KG బరువున్న భారీ శాటిలైట్లను సైతం మోసుకెళ్లగలదు.
14 ఏళ్ల పాటు సేవలు
కాగా 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు అవ్వలేదు. అందుకే దానిని స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ Internet సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. GSAT-N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో Wi-Fi సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
GSAT20 from SLC40 taken from Loop Road. 📹WAI, media. pic.twitter.com/MeEbFpk9cZ
— SpaceCoastPictures (@John_Winkopp) November 18, 2024








