అఖిల్​ వివాహం ఎప్పుడంటే.. చెప్పేసిన నాగార్జున

అక్కినేని కుటుంబం నుంచి వరుస సర్​ప్రైజ్​లు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే నాగచైనత్య–శోభిత దూళిపాల వివాహాన్ని ప్రకటించిన నాగార్జున.. రెండ్రోజుల క్రితం చిన్న కొడుకు అఖిల్ (Akhil Akkineni)​ ఎంగేజ్​మెంట్​ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్​ రౌడ్జీతో (Zainab Ravdjee) నిఖిల్​కు జరిగిన నిశ్చితార్థం ఫొటోలకు సోషల్​ మీడియాలో పంచుకున్నారు.

డిసెంబర్​ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, (Naga Chaitanya) శోభిత (sobhita dhulipala) వివాహం జరగనుండగా.. అదే వేదికలో అఖిల్​, జైనాబ్​ రౌడ్జీ వివాహం కూడా జరుగుతుందా? అసలు జైనాబ్​ రౌడ్జీ ఎవరు లాంటి పలు అనుమానాలను సినీ అభిమానులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఓ ఇంటర్వ్యూలో అఖిల్–జైనాబ్​ రౌడ్జీ​ వివాహం గురించి స్పష్టతనిచ్చారు. వారి వివాహం వచ్చే ఏడాదే ఉంటుందని తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. ‘అఖిల్​ ఎంగేజ్​మెంట్​ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్​ లాంటి అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్​కు సరైన జోడీ. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరగనుంది’ అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం నాగచైతన్య తండేల్​ సినిమా చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఇక గతేడాది ఏజెంట్​ సినిమాతో పలకరించిన అఖిల్.. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నాడు. దీనికోసం తన లుక్​ను కూడా మార్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.​ నాగార్జున ప్రస్తుతం శేఖర్​ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా సినిమాలో, రజినీకాంత్​ హీరోగా లోకేశ్​ కనకరాజ్​ తెరకెక్కిస్తున్న కూలీ నినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *