Comedian Ali: బాలీవుడ్‌లోకి అలీ రీఎంట్రీ.. ఫుల్ లెంగ్త్ మూవీకి సైన్

అలీ (Comedian Ali).. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ దాదాపుగా ఉండరు. తన కామెడీ టైమింగ్‌(Comedy timing)తో కడుపుబ్బా నవ్వించే అలీ బుల్లితెరపై కూడా తనదైన ట్రేడ్‌మార్క్(Trademark) వేశారు. అలీతో సరదాగా అంటూ టీవీ ప్రేక్షకులను అలరించాడు. రాజమండ్రి మ్యూజికల్ కంపెనీ ‘జిత్ మోహన్ మిత్ర(Jeet Mohan Mitra)’ సహాయంతో అలీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు బాలనటుడి(As a child actor)గానూ పలు చిత్రాల్లో అలీ నటించారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 1250 సినిమాల్లో నటించారు. హీరోగా 50కిపైగా మూవీలు చేశారు.

* ఆశిష్ కుమార్ దూబే ద‌ర్శ‌క‌త్వంలో

అలీ హీరో(Hero)గా న‌టించిన య‌మ‌లీల‌, ఘ‌టోత్క‌చుడు, పిట్ట‌ల‌దోర సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. ఇక ఈ ఏడాది క‌మెడియ‌న్‌గా గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, స‌రిపోదా శ‌నివారం, డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో తన మ్యానరిజాన్ని ప్రదర్శించాడు ఈ సినీనియర్ నటుడు. తాజాగా అలీ బాలీవుడ్‌ (Bollywood)లో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా(Welcome to Agra)’ పేరుతో ఓ సినిమా చేస్తోన్నారు. ఇటీవ‌లే ముంబైలో ఈ బాలీవుడ్ మూవీ ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు ఆశిష్ కుమార్ దూబే(Ashish Kumar Dubey) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

* రాజకీయాలకు గుడ్ బై

ఉత్తర్‌ప్రదేశ్‌(UP)లోని ఆగ్రా కేంద్రంగా జ‌రిగే ప్రేమ‌క‌థతో వెల్ క‌మ్ టూ ఆగ్రా మూవీ తెర‌కెక్కుతోంద‌ని అలీ తెలిపాడు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన పాత్ర‌ల‌కు పూర్తిగా భిన్నంగా ఈ బాలీవుడ్ మూవీలో క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని చెప్పాడు. కామెడీ, ఎమోష‌న‌ల్ మిక్స్‌గా సాగుతుంద‌ని తెలిపాడు. హిందీలో టోట‌ల్ ధ‌మాల్‌, ముఖాబులాతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు అలీ. ఇక చాలా కాలంగా YCPలో కొన‌సాగాడు అలీ. AP ఎల‌క్ట్రానిక్ మీడియా అడ్వైజ‌ర్‌గా ప‌నిచేశారు. ఈ ఏడాది జూన్‌లో రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *