Gastric Problems: గ్యాస్ట్రిక్​ వేధిస్తోందా? ఇలా తగ్గించుకోండి

సరైన సమయానికి ఆహారం తినకపోవడం, జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య (Gastric problem) వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంటుంది. ఛాతి, కడుపులో మంటగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని శక్తి హీనంగా మార్చుతుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి చిన్నచిన్న చిట్కాలు పాటించి (remedy for gastric problem) ఉపశమనం పొందవచ్చని నిపుణుల చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం రండి.

ఈ మార్పులు అవసరం
జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చుని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో గ్యాస్ సమస్యను తీవ్రతరం చేసే పొగతాగడం, కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినాలని సలహా ఇస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, బ్రొకొలి, దోసకాయలు తినడం మంచిదని చెబుతున్నారు.

తిన్న వెంటనే నిద్ర వద్దు
రాత్రి తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే అది సరిగా అరగదని, ఫలితంగా గ్యాస్ట్రిక్​ సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు.

ఉడికించి లేదా కాల్చి తినండి
చికెన్, చేపలు లాంటి వాటిని ఉడికించి లేదా కాల్చి తినడం మంచిది. వాటిని ఆయిల్​లో ఫ్రై చేసినా, ఆయిల్​లో ఉడికించి తిన్నా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు వైద్యులు.

ఇవీ ఉపశమన మార్గాలు..
* పుదీనా (mint) ఆకులను నమిలినా, లేదా పుదీనా గ్యాస్ సమస్య నుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఇది పొట్టలో గ్యాస్​ను వెంటనే తగ్గిస్తుంది.

* చామంతితో చేసిన టీని తాగితే కూడా మంచి ఫలితం లభిస్తుంది.

* పొట్టలో అధిక గ్యాస్ వేధిస్తున్నప్పుడు గ్యాస్ సమస్య నుంచి విముక్తి కోసం యాక్టివేటెడ్ చార్ కోల్ ట్యాబ్లెట్లను (activated charcoal tablets) డాక్టర్ల సలహా మేరకు వేసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

* పొట్టలో గ్యాస్ సమస్య వేధిస్తున్నట్లయితే నీళ్లు, టీలో ఆపిల్ సైడర్ వెనిగర్ (apple cider vinegar) కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.

* గ్యాస్ సమస్య మరీ తీవ్రంగా వేధిస్తుంటే లవంగాలను తింటే మంచింది. లవంగాల నూనెను (Clove Oil) ఆహారంలో వాడటం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *